కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాల ధరఖాస్తుల స్వీకరణ లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గురు వారం జిల్లెల్ల గ్రామంలో స్ధానిక తాహాసిల్దార్ ఇబ్రహీం ఆధ్వర్యంలో అధికారులు గ్రామ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమం ద్వారా ద్వారా నిజమైన లబ్ధిదారులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొమ్మ గోని రవి గౌడ్, కో ఆప్షన్ నెంబర్ గుమ్మకొండ బాల్ జంగయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిలతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏముక రవి, మహేందర్, పెరుమాల శ్రీశైలం, బాల్ రాజ్, సావుకారి మల్లయ్య,బీరయ్య సాయి, గణేష్, మహేష్, రమేష్ , మహేష్, జంగయ్య రాజు, ప్రభాకర్, శ్రీశైలం, పరమేష్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News