కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వాహనంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధాడికి పాల్పడ్డారు. ఆది వారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మధ్యలో వెళ్లిపోతున్న మంత్రిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మంత్రికి భద్రత కల్పిస్తూ వాహనాన్ని అక్కడి నుంచి పంపించి వేశారు. పెద్దమందడి ఎంపీపీ అయినా తూడి మెగా రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశాడు. ఫలితాల లో భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండగా చేసేది లేక అవమానంతో మంత్రి కౌంటింగ్ మధ్యలో బయటికి వెళ్ళిపోతుండగా పార్టీ శ్రేణులు జండాకర్రలతో చేతులతో వాహనంపై కొడుతూ దాడికి పాల్పడ్డారు. వనపర్తి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 210739 పోలయ్యాయి. అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూడి మేఘారెడ్డి కి వచ్చిన ఓట్లు 106591. కాగా బీ ఆర్ యస్ పార్టీ అభ్యర్థి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి 81269 వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూడి మేఘారెడ్డి 25322 ఓట్ల మెజారిటీతో మంత్రిపై విజయం సాధించాడు.
Admin
Kalam Power News