కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గత ఆరు రోజులు గా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి లు తెలిపారు. ఆదివారం 7 వ రోజు శ్రీ శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవ అభిషేకాలు, దంపతలచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, బిజెపి పార్టీ నాయకులు శాకాంబరీ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయనకు దేవాలయం చైర్మన్, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ మన పెద్దలు సంపద, సనాతన ధర్మం, హిందూ సంస్కృతి సంప్రదాయాలను మనకు అందించారు అని ఇప్పుడు సంపదను కాపాడుకుంటూ, సనాతన ధర్మాన్ని మన పిల్లలకు నేర్పాడం లేదు అని అన్నారు, దైవ భక్తి,దేవతల చరిత్ర గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఆచారి ని,కండె హరిప్రసాద్ ను, స్థానిక బిజెపి పార్టీ నాయకులను దేవాలయం చైర్మన్, ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా మెమెంటో తో సన్మానం చేశారు. అనతరం పట్టణానికి చెందిన జే ఎస్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు శేఖర్ ఆద్వర్యంలో చిన్నరులచే నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది డాన్స్ మాస్టర్ శేఖర్ ను చిన్నారులను మెమెంటో తో సన్మానం చేశారు. ఆనంతరం వాసవి క్లబ్ అంతర్జాతీయ ఆద్వర్యంలో పది, ఇంటర్, డిగ్రీ లో 98 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు 10 వేల రూపాయల స్కాలర్ షిప్ పట్టణానికి చెందిన 5 మంది విద్యార్థులకు ఈరోజు వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు జూలూరి రమేష్ బాబు, అధ్యక్షుడు బాదం రాఘవేందర్ లు అందజేశారు. ఈసందర్భంగా దేవాలయం చైర్మన్, వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు, మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఉన్నత చదువులకు ఎంతో సహాయం గా ఉంటుంది అని తాను ఇలాంటి ప్రోత్సాహం కోసం 5 లక్షలు 50 మందికి కి సహాయం అందించడం జరిగింది అన్నారు. ఆదే విధంగా సంప్రదాయ బద్ధంగా దుస్తులు అలంకారం తో దేవాలయానికి వచ్చిన మహిళల కు లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఇద్దరికీ రాచూరి రాంమోహన్ సహకారంతో బహుమతులు అందజేశారు. ఆనంతరం పెద్ద మంగళ హారతి దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి, ఉత్సవ కమిటీ సలహాదారు వాస శేఖర్, కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండ్ల రేవంత్, డి నితిన్, కోశాధికారి లు పోల గిరిబాబు, సంబ తరుణ్ లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు సభ్యులు మహిలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Kalam Power News