కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ఎస్స్టిమేషన్ పెంచి వందల కోట్లు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దోచుకుతిన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించడం అర్ధరహితమని ఎమ్మెల్యేకు దమ్ముంటే ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ అయినా ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నే ఉన్నారని ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎన్ని వందల కోట్లు లక్ష్మారెడ్డికి ఇచ్చారో కాంట్రాక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేత ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచాలని లేకుంటే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మహబూబ్ నగర్ జడ్పీ వైస్ చైర్పర్సన్, టిఆర్ఎస్ నేత కోడుగల్ యాదయ్య డిమాండ్ చేశారు. ఆధివారం జడ్చర్ల మాజీ ఎమ్మేల్యే సీ.లక్ష్మారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యేల బృందం రెండు రోజుల క్రితం జరిపిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ల సంధర్శన సంధర్బంగా ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్చర్ల ఎమ్మేల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన తీవ్ర స్ధాయిలో ఖండించారు. రిజర్వాయర్ నిర్మాణంలో బాగంగా పెరిగిన ధరలకు అనుగూనంగా పెంచిన నిర్మాణ వ్యయం (ఎస్టీమేట్స్ ) ప్రభుత్వానికి సంభంధించినవి కాగా, అందులో ఎమ్మేల్యేకు ఏమి సంభంధం ఉంటుందన్నారు. దీనిపై అవగాహన లేకుండ ఎమ్మేల్యే అనిరుద్ రెడ్డి మాజీ ఎమ్మేల్యే లక్ష్మారెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రిజర్వాయర్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఎకరాకు 15 లక్షల రూపాయలు ఇప్పిస్తానని లేకుంటే తన 50 ఎకరాల భూమి అమ్మి డబ్బులు చెల్లిస్తానని భూ నిర్వాసితులకు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు ముందు భూ నిర్వాసితులకు ఎకరాకు 15 లక్షల రూపాయలు ఇప్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. జడ్చర్ల అభివృద్దిపై మాజీ ఎమ్మేల్యే మల్లురవి కూడ ఏనాడు వ్యక్తి గత ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు. జడ్చర్ల అభివృద్దికి బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందని తెలి పారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఏలాంటి అవినీతి జరిగినా భాద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హోదాను మరచి పౌరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగితే తాము కూడా అదే స్థాయిలో స్పందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ పాలెం సుధర్శన్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ పిట్టల మురళీ, కౌన్సిలర్ సతీష్, టైగర్ నరసింహ, నాగిరెడ్డి, ఇంతియాజ్, వల్లూరు వీరేష్ శంకర్ నాయక్, తధితరులు ఉన్నారు.
Admin
Kalam Power News