కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : అలంపూర్ పర్యటనకు వచ్చిన దేవాదాయ అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మరియు ఎ ఐ సిసి కార్యదర్శి సంపత్ కుమార్ ను మంగళ వారం జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి సంఘం( TRPS) అధ్యక్షుడు కోట నరసింహులు కలిసి నడిగడ్డ నేతన్నల సమస్యలపై వినతి పత్రం ఇచ్చి చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలో 2008వ సంవత్సరం లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్వాల నేతన్నల అభివృద్ధి కొరకు కేటాయించిన 50 ఎకరాల భూమిని హ్యాండ్లూమ్ పార్క్ గా ప్రకటించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ యొక్క పార్కును అభివృద్ధి చేయకపోవడం చాలా దురదృష్టకరమని గద్వాల జిల్లాలో చేనేత కార్మికులు చాలామంది నివసించడానికి నివాస గృహాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇళ్లల్లో చేనేత కార్మికులకు ప్రత్యేక వాటా కేటాయించాలని అదేవిధంగా హ్యాండ్లూమ్ పార్క్ లో హౌస్కం వర్క్ స్కీం ఇంప్లిమెంటేషన్ చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మళ్లీ పునరుద్ధరించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ టిపిసిసి చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు చిన్ని నాగరాజు రాజోలు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులిపాటి దస్తగిరి పగడాకుల శంకర్ మారుతి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News