Thursday, 17 September 2026 01:36:21 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

“నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..?

ఐదు రూపాయల భోజనం నిడ పై అక్కసు..- మున్సిపాలిటీ అడ్డంకులపై ప్రజల ఆగ్రహం..!!

Date : 25 March 2026 04:11 PM Views : 504

కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 25 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) ఎండ తాపం పెరుగుతున్న వేళ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కనీస నీడ కూడా దక్కకుండా “టెంట్” చుట్టూ చిల్లర రాజకీయాలు ముదురుతున్నాయనే విమర్శలు మహబూబ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి. బస్టాండ్ ఎదురుగా ఉన్న 5 రూపాయల భోజన కేంద్రం వద్ద చినిగి పోయి వున్న టెంట్ స్థానంలో కొత్త టెంట్ ఏర్పాటు విషయంపై మున్సిపాలిటీ సిబ్బంది వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎస్. రాజేందర్ రెడ్డి స్వంతంగా ₹13 వేల రూపాయలు ఇచ్చి టెంట్ వేయాలని టెంట్ షాప్ యజమానికి 15 రోజుల క్రితమే సూచించినట్టు సమాచారం. సదరు టెంట్ షాప్ యజమాని 5 రూపాయల భోజన కేంద్రానికి పంపిన కుడా ఇప్పటికీ ఆ టెంట్ ఏర్పాటు కాకపోవడం, మున్సిపాలిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ( మానవత్వం తో ముందుకు వచ్చి న దాతలను కూడా అడ్డుకుంటున్నారు.) ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. :::: “నీడకైనా అనుమతులా..?” :::: పేదలకు తక్కువ ధరలో భోజనం అందించే కేంద్రం ముందు కనీస నీడ కల్పించడమే పెద్ద సమస్యగా మారిందా? “బతుకుదెరువు కోసం వచ్చిన వారికి ఎండలోనే కూర్చోమంటారా?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. “చెట్టుకింద కూర్చోమన్నా చలికాలం, టెంట్ వేయొద్దన్నా ఎండకాలం” అన్నట్టుగా పరిస్థితి తయారైందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. :::: 13 వేల టెంట్… పై అక్కసు ఎవరికి..- పేరు వస్తుందని దురుద్దేశంతో అడ్డుకున్నారా.? :::: టెంట్ కోసం డబ్బులు ఇచ్చారు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా అమలు మాత్రం లేదు. ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. మున్సిపాలిటీ అనుమతి లేకపోవడమే కారణమా? లేక “ఎవరు పెట్టారు?” వారికి పేరు వస్తుందన్న రాజకీయ లెక్కలేనా? పేదల అవసరాల కంటే పేరు ప్రతిష్టలే ముఖ్యమా.? అనే ప్రశ్న ప్రజల మదిలో తొలుస్తుంది. “ఒకరికి పేరు వస్తుందనే భయంతో టెంట్ కూడా వేయనివ్వకపోవడం ఎంతవరకు న్యాయం.?” “ఒక్క గిన్నె అన్నం తినే చోట కూడా రాజకీయాలు చేస్తే… ప్రజాసేవ ఎక్కడ?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ::: మున్సిపాలిటీ మౌనం – సందేహాల మబ్బులు ::: ఈ వ్యవహారంపై మున్సిపాలిటీ నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా కనిపించే “టెంట్” అంశం ఎందుకు ఇంత వివాదాస్పదమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అవసరం “నీడ”… కానీ అందిస్తున్నది “నేడూ – రేపూ” అనే రాజకీయ వాగ్దానాలేనా.? “ఒక ప్లేట్ అన్నం ముందు నీడ కూడా లేకపోతే… ఆ అభివృద్ధి ఎవరికోసం.?” 'ఇదేనా ప్రజా పాలనలోని మార్పు' మహబూబ్‌నగర్‌లో ఈ ప్రశ్నకు సదరు ప్రజా ప్రతినిదులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది...

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: