Wednesday, 15 April 2026 09:14:07 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర!

“కలం మీద కత్తి నీడ… పాలమూరులో ‘గ్యారేజ్ రాజ్యం’!”*. *వార్త రాస్తే వేట… ప్రశ్నిస్తే బెదిరింపులు… ఇదేనా ప్రజాపాలన..?*

Date : 02 April 2026 09:31 AM Views : 461

కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, ఏప్రిల్ 1 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) “నిజం రాస్తే నిప్పు అంటుకుంటుందా.? మంటపుడుతుందా” అన్నట్టు పాలమూరులో జర్నలిస్టుల పరిస్థితి మారింది. ప్రశ్నించే కలం కనిపిస్తే చాలు… దానిని వంచాలని, భయపెట్టాలని ప్రయత్నించే కొత్త సంస్కృతి తలెత్తుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులపై పెరుగుతున్న బెదిరింపులు, నిఘా చర్యలు కలకలం రేపుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై ‘గ్యారేజ్ సభ్యులం’ అంటూ చెప్పుకునే కొందరు వ్యక్తులు జర్నలిస్టులపై నిఘా, వేట, బెదిరింపులతో గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. :: నిఘా నీడలో కలం యోధులు...వార్త రాస్తే వేట…! :: ప్రభుత్వంపై విమర్శాత్మక కథనాలు రాసిన జర్నలిస్టుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ, వారి కుటుంబ వివరాలు సేకరిస్తూ, కదలికలపై నిఘా పెట్టడం ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్‌గా మారిందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైక్‌లపై గుంపులుగా తిరుగుతూ “వాడు మహబూబ్ నగర్ లో ఎలా ఉంటాడో చూస్తాం” అంటూ హెచ్చరికలు జారీ చేయడం—ఇది ప్రజాస్వామ్య దేశంలో జరుగుతుందా లేక సినిమాల సన్నివేశమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులు జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాలపై ఫోటోలు తీసి, బినామీ పేర్లతో కలెక్టర్ కు ఫిర్యాదులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ కక్ష పూరిత పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ⚖️ జర్నలిజం తాకట్టు? ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రచురితమైన "ప్రెస్ క్లబ్ కు తాళం వేయిస్తా అనే కార్టూన్" నేపథ్యంలో ఒక రిపోర్టర్‌ను లక్ష్యంగా చేసుకుని వేట ప్రారంభించారన్న వార్తలు జర్నలిస్టు వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అదికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు జర్నలిజాన్ని ఒత్తిడులకు లోనుచేసే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు కొందరు "ప్రజాప్రతినిధుల" మద్దతు కుడా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టులపై జరుగుతున్న పరిణామాలపై సంబంధిత అధికారులు మౌనం పాటించడం ప్రశ్నార్థకంగా మారింది. ???? జర్నలిస్టుల హెచ్చరిక జర్నలిస్టులపై జరుగుతున్న బెదిరింపులు, నిఘా చర్యలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వేచ్ఛాయుతమైన పాలనలో ఇలాంటి చర్యలకు తావుండకూడదని స్పష్టం చేస్తున్నాయి. జర్నలిస్టుల భద్రతకు భరోసా కల్పించకపోతే, రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిదని గుర్తుచేస్తున్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :