Wednesday, 16 September 2026 05:37:37 AM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య

“సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?!

అనిరుధ్ ఇప్పసారా వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఘాటు విమర్శలు – ప్రశ్నించాల్సిన మీడియా ఎందుకు మూగబోయింది.?

Date : 11 March 2026 08:51 AM Views : 1249

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 11 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) “దొరలుతాగుఇప్పసారా తాగుదమేబాల.. మనం ఊగూదమేబాల..దొరలుతాగు.. ఇప్పసారా..దొరలుతాగు..ఇప్పసారా.. జడ్చర్ల గడ్డమీద...తాగి ఊగూదమే బాల.. ఊగూదమే బాల..!” అనే పాట విని కాంగ్రెస్ పార్టీలో నేతలు ప్రభావితం అయ్యారో ఏమో కానీ ఇప్పుడు ప్రజలు మాత్రం "ఏం మార్పు రా బాబు ఇదే నా మనం కోరుకున్న మార్పు.!" అంటూ తెలంగాణ ప్రజానీకం బెంబే లెత్తి పోతుంది. సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజా ప్రతినిదులు ప్రజల అసలు సమస్యలు పక్కనబెట్టి “ఇప్పపూల సారా” మాటలే ప్రధాన చర్చగా మారడంపై జడ్చర్ల ప్రజలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న బాధాకర ఘటనలపై సోయి, స్పందన కనిపించకపోయినా, సారా అంశాలపై మాత్రం రాజకీయ చర్చలు సాగడం విచిత్రమని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన ఇప్పపూల సారా వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజల ప్రాణాలు, వారి గౌరవం కంటే ఇలాంటి అంశాలే ముఖ్యమా అనే ప్రశ్నను లేవనెత్తారు. “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదేమో!” అన్నట్లుగా పరిస్థితి మారిందని విమర్శిస్తున్నారు. గత వారం నాగసాల గ్రామానికి చెందిన దళిత యువకుడు భీమేష్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనను వారు గుర్తుచేశారు. బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో భీమేష్ మృతదేహాన్ని కుక్కలు పీక్కు..తిన్న ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినప్పటికీ కనీసం బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే కు సమయం దొరకలేదని, కానీ క్యాంపు కార్యాలయంలో "ఇప్పపూల సారా" అంశంపై విలేఖరుల సమావేశం నిర్వహించేందుకు మాత్రం సమయం కేటాయించారని వారు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. “ప్రజల కన్నీళ్లు ఎండకముందే రాజకీయ ప్రసంగాలు మొదలవుతాయా.?” అని ప్రశ్నించిన ప్రతి పక్ష పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రజల సమస్యలపై ముందుగా స్పందించడమేనని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రశ్నించాల్సిన మీడియా ప్రతినిధులు కూడా మౌనం పాటించడం ఆశ్చర్యకరమని . దళిత యువకుడు భీమేష్ మృతి తర్వాత జడ్చర్లకు వచ్చిన ఎమ్మెల్యేను ఈ అంశంపై నిలదీయాల్సిన స్థానిక మీడియా ఎందుకు నిశ్శబ్దంగా నిలిచిందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల ప్రాణాలు, వారి గౌరవం రాజకీయాల కంటే గొప్పవని, అలాంటి ఘటనలపై ముందుగా స్పందించడమే ప్రజాప్రతినిదుల కర్తవ్యమని పలువురు సూచిస్తున్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: