కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.9 రోజుల పాటు అమ్మవారికి ఘనంగా పూజలు జరుగుతాయి. వాసవి మాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులకు రోజుకో రూపంలో దర్శనమిస్తారు.వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఫౌండర్ ట్రస్టు చైర్మన్ జూలూరి రమేష్ బాబు దేవి శరన్నవరాత్రి ఉత్సవకమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాస్ లు,ఇతర అనుబంధ సంఘాఏర్పాట్లు పూర్తి చేశారు.. .నవరాత్రి ఉత్సవాలలో ఈ నెల 3 వాసవి మాత గజలక్ష్మి అవతారములో భక్తులకు దర్శనం ఇస్తారు.నిర్వాహకులు అమ్మవారిని గజ లక్ష్మి రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు .ఈ నెల 4 వాసవి మాత ధనలక్ష్మి అవతారంలో భక్తులను అనుగ్రహించనుoది. 5 శనివారం నాడు అన్నపూర్ణ దేవి,ఈ నెల ఆరు ఆదివారం రాజరాజేశ్వరీ దేవి రూపంలో ,నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా 7 వరోజు న లలితాదేవి గా 8వ రోజు బాలాత్రిపుర సుందరి దేవి గా ,9 వ రోజు సరస్వతీ దేవి గా వాసవి మాత భక్తులకు దర్శనం ఇస్తారు ఈ నెల 10 దుర్గ దేవిగా అమ్మవారు దర్శన ఇస్తారు.అలాగే నిర్వహకులు చండీ యాగం నిర్వహించనున్నారు.11 శుక్రవారం నాడు మహిషాసురమర్దిని దేవి అమ్మవారికి అలoకరించనున్నారు ,12 న వాసవి కన్యకాపరమేశ్వరి దేవి అలంకరణలో వాసవి మాతను అలంకరిస్తారు.చివరి రోజు ఈ నెల 13 న అమ్మ వారి శోభాయాత్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున కార్యక్రమo నిర్వహిస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.నవరాత్రి వేడుకల్లో వాసవి క్లబ్,ఆవోప, ఆర్య వైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయనున్నారు.. ప్రతి ఒక్కరూ వాసవి మాత అనుగ్రహం పొందాలి...ఆలయ ఫౌండర్ ట్రస్టు చైర్మన్ జూలూరి రమేష్ బాబు శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో నవరాత్రులు ఘనగా నిర్వహిస్తామని ఆలయ ఫౌండర్ ట్రస్టు చైర్మన్ జూలూరి రమేష్ బాబు పేర్కొన్నారు.పట్టణంలోని ఆర్యవైశ్యుల తో పాటు పట్టణ ప్రజలు వాసవి మాత నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని ఆయన కోరారు..శరన్నవ రాత్రుల ఉత్సవాల్లో పాల్గొని వాసవి మాత అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు భక్తులను కోరారు. శరన్నవ రాత్రులకు ఏర్పాట్లు పూర్తి....ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంప శ్రీనివాసులు* దేవి శరన్నవ రాత్రుల ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంప శ్రీనివాసులు పేర్కొన్నారు.తొమ్మిది రోజులపాటు కన్నుల పండుగగా జరిగే జరిగే వాసవి మాత నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు లను పూర్తి చేశామని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
Admin
Kalam Power News