కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త వారోత్సవాల ముగింపును పురస్కరించుకొని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేష్ బాబు ను ఘనంగా సత్కరించారు కల్వకుర్తిలోని ఆయన స్వగృహంలో కల్వకుర్తి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి పెన్నును బహుకరించారు ఈ సందర్భంగా జూలూరు రమేష్ బాబు మాట్లాడుతూ సామాజిక సేవలో వాసవి క్లబ్స్ పాత్ర అమూల్యమైనది ఉన్నారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా బాధ్యులు శివ జగదీశ్వర్, ఇరివెంటి రమేష్, కల్మిచర్ల గోపాల్ క్లబ్ అధ్యక్షుడు చిదిరె శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, క్లబ్ ప్రధాన కార్యదర్శి కల్వ ఆంజనేయులు, కోశాధికారి దుగ్గి అశోక్, జోన్ చైర్మన్ కూన సంతోష్, పూర్వాధ్యక్షులు మాచిపెద్ది అశోక్, ఉపాధ్యక్షులుకొండూరు కృష్ణయ్య, నరసింహులు గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News