కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా నగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ను డాక్టర్ మల్లురవికే ఇవ్వాలని మంగళ వారం ఈ.రాములు టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ కోరారు. ఎప్పుడు ప్రజలలో వుండి పిలిస్తే పలికే మల్లురవి కే ఎంపీ టికెట్ ఇవ్వాలన్నారు. గత యాభై సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీ కొసం కృషి చేసిన వ్యక్తి పార్టీ కష్టాల్లో వున్నపుడు కూడా పార్టీకి సేవ చేసిన కుటుంబ వారిది కావున వారికీ ఎంపీ టికెట్ ఇవ్వాలన్నారు. ఎంపీ గా వున్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేశారని కావున నగర్ కర్నూల్ లో అందరికి సూపరిచితుడు, ప్రజల మెప్పు పొందిన వ్యక్తి మల్లురవి. మల్లురవిని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ ఈ.రాములు, వస్ఫూల ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్ కాంచనపల్లి నర్సింములు, అరేళ్ళ యాదయ్య కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ నాయకులు, నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News