కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ క్షల్వకుర్తి కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం వాసవీ క్లబ్ భవనం కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా బాదం రాఘవేందర్ , బాదం ధనలక్ష్మి ,ప్రధాన కార్యదర్శులుగా నీల కోటీశ్వర్ ,నీల స్రవంతి మరియు కోశాధికారులుగా మాచిపెద్ది రవి కల్పన లను నియమించారు. ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథమ్ నాగేష్ మరియు గౌరవ అతిథులుగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు, ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ కల్వ హరికృష్ణ, నగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ , జిల్లా V108A గవర్నర్ విచ్చేసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం జరిగింది. అనంతరం గవర్నర్ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిధి మాట్లాడుతూ క్లబ్ నుంచి విస్తృత సేవలు అందించి క్లబ్ ను ఉన్నత స్థాయి లో ఉంచి పలు అవార్డులు అందుకోవాలి అని నూతన కార్యవర్గానికి సూచించడం జరిగినది. ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా వైస్ గవర్నర్ కలిమిచెర్ల రమేష్, జిల్లా సెక్రెటరీ కోదండరాములు, జిల్లా కార్యదర్శి కండె కృష్ణ, రీజియన్ చైర్మన్ పోల చంద్రమౌళి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నీల లింగం , కలిమి చర్ల గోపాల్, జిల్లా కోఆర్డినేటర్ గుగ్గిళ్ల శంకర్, జూలూరి సత్యం మరియు జోన్ చైర్మన్ చిదిరే శ్రీనివాసులు , పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు వాస శేఖర్, ఆవోప అధ్యక్షుడు సతీష్ గుప్త, వెంకటేశ్వర దేవాలయం చైర్మన్ కల్వ మనోహర్,మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండురు కృష్ణయ్య,మహిళ సంఘం, యువజన సంఘం అధ్యక్షులు గోవిందు మౌనిక,సంబు తరుణ్, ఆర్యవైశ్య అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్స్ ,డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఆర్యవైశ్య ప్రతినిధులు అవోపా ప్రతినిధులు , బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
Admin
Kalam Power News