కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఈనెల 27న నాగర్ కర్నూల్ లో జరిగే మాలల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీఎన్జీవో భవనంలో మాలల ఆత్మగౌరవ సభ జరిగింది.సందర్భంగా చైర్మన్ చెన్నయ్య మాట్లాడుతూ మాలల ఆత్మగౌరవ సభను ఉమ్మడి జిల్లాలోని మాలలుఅందరూ తండోపతండాలుగా తరలివచ్చి మాలల ఆత్మ బంధువులు సత్తా చాటాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా వర్గీకరణ పేరుతో రాజకీయ పార్టీలుతమ స్వలాభం కోసం కుట్రలు చేసి పబ్బం గడుపుతున్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి రాజకీయ పార్టీలు తూట్లు పొడిచి వర్గీకరణ పేరుతో ఎస్సీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయిఅని వెంటనే వర్గీకరణ ప్రయత్నాన్ని విరమించుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు మంత్రి నరసింహయ్య, మాల జేఏసీ నాయకులు కేశవులు,కిషన్, రాములు,రవి,రామచందర్ వెంకటేశ్వర్లు,గోపాల్,లక్ష్మణ్, వెంకటస్వామి, కాడం రాఘవేందర్, కృష్ణ, నరేష్ యాదయ్య కనకరాజు, బాలరాజు తదితర మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News