కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు అమ్మవారు మహిషాసుర మర్ధిని దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ పవిత్రమైన రోజు అమ్మవారి వేడుకల ముగింపును సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, నవరాత్రి, దుర్గాపూజను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఇదే రోజున దుర్గా దేవి మహిషాసురుడిని మట్టుబెట్టిన రోజు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, ధాత్రీ అంటే ఇచ్చేది. దేవాలయంలో ఉదయం అమ్మవారి సుప్రభాతం, అభిషేకం, ప్రాతః కాల పూజలతో మొదలుకొని రెండు పర్యాయాలు సామూహిక కుంకుమార్చనలు, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా,లలితా సహస్ర నామాలు పఠించడం జరిగింది. ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారామ రావు హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం మహా మంగళ హారతి తీర్థప్రసాద వితరణ, విచ్చేసిన భక్తులకు భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం మహిళలచె దాండియా, కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేవాలయాల ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, శివ జగదీశ్వర్ మరియు, ఆర్యవైశ్య సంఘం , అవోప, వాసవి క్లబ్ మరియు అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News