Wednesday, 15 April 2026 09:06:03 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

“కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!”

“కాంక్రీట్ పెరిగింది… కాపాడే చేతులు ఎక్కడ.? కుక్కల రాజ్యంలో ‘కాగితాల రాజ్యం’!” “కాంక్రీట్ జంగిల్‌లో కమిషనర్ గారి నిద్ర గాధ!”

Date : 23 March 2026 08:30 AM Views : 216

కలం పవర్ న్యూస్ - సోషియల్ మీడియా వైరల్ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 23 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) “అంకుల్..! ఆడుకోవడానికి బయటికొచ్చాం… కుక్కలు కరుస్తున్నాయి… మేమేం చేయాలి.?” అనే రోదనలు రొజు వినిపిస్తున్నాయి. “కాంక్రీట్ జంగిల్‌లో కమిషనర్ గారి నిద్ర గాధ!” ను చూస్తే.. మహబూబ్‌నగర్ పట్టణం క్రమంగా కాంక్రీట్ జంగల్‌గా మారుతుండగా, నగరంలో ‘వీధి కుక్కల స్వైర విహారం’ ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. ఆది వారం రాత్రి వేళ గోల్ మస్జిద్ ప్రాంతంలో జరిగిన ఘటనలో చిన్నపిల్లలు కుక్కల దాడికి గురవడంతో, పట్టణ భద్రతపై మరొకసారి ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. “పట్టణ అభివృద్ధి అంటే భవనాల పెరుగుదల మాత్రమేనా.? లేక ప్రజల భద్రత కూడా కుడా అందులో భాగమే కదా.? ” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పిల్లలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొనగా, అధికార యంత్రాంగం మాత్రం మౌనం వహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “కాంక్రీట్ పెరిగింది… పన్నులు కొట్లలో వసూళ్లు చేస్తున్నారు.. కార్పోరేషన్ కు వచ్చే రాబడినే చూస్తున్నారు కాని చిన్నారుల కు మాత్రం భద్రత, రక్షణా కరువైంది.? “ఎందుకు వారికి ఓటు హక్కులేదనేనా..?” అనే సందేహం మహబూబ్‌నగర్ ప్రజల మనసుల్లో మిగిలిపోతోంది. మహబూబ్‌నగర్ పట్టణం రోజురోజుకు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న వేళ, ప్రజల భద్రత మాత్రం కాగితాలపైనే పరిమితమవుతోంది. గోల్ మస్జిద్ ప్రాంతంలో చిన్నపిల్లలపై కుక్కల దాడి ఘటన, అధికార యంత్రాంగం “చూసే చూపు – చేసే పని” మధ్య ఉన్న అంతరాన్ని బహిర్గతం చేసింది. “చేతిలో కర్ర లేకపోతే కుక్క దూకుతుంది” అన్న సామెత ఇక్కడ సాక్షాత్కారం అవుతోంది. నియంత్రణ చర్యలు లేకపోతే సమస్యలు తలెత్తడం సహజం. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం “ముందు చూపు లేకపోతే వెనుక నష్టం తప్పదు” అనేలా మారింది. పట్టణంలో చెత్త పేరుకుపోవడం, వీధి కుక్కల పెరుగుదలకు కారణమవుతుంటే, శాశ్వత పరిష్కారం మాత్రం ఎప్పటికీ “ఫైళ్లలోనే” తిరుగుతోంది. “గాలి మాటలు గోడ దాటవు” అన్నట్టు, ప్రకటనలు, హామీలు ప్రజల దైనందిన జీవితాన్ని రక్షించలేకపోతున్నాయి. “పిల్లల భద్రత కంటే ఫైళ్ల భద్రతే ముఖ్యమా?” అంటూ ప్రజలు అడుగుతున్న ప్రశ్న సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు అధికారులు సమావేశాలు, సమీక్షలు అంటూ, "మద్యమద్యలో కాజు, బాదం, పిస్తాలు తింటూ కాలక్షేపం చేస్తుంటే..", మరో వైపు వీధుల్లో పిల్లలు భయంతో బిక్కు బిక్కు మంటూ అడుగులు వేస్తున్నారు. “ కుక్కలను చూసి జాగ్రత్త చర్యలు చెప్పడం కాదు… అది కాటు వేయక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి ” అన్న సూత్రం ఇక్కడ పూర్తిగా విస్మరించబడింది. జిల్లా కలెక్టర్ స్థాయిలో సమస్యపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే “పెద్దవాడు కదలితేనే చిన్నవాడు కదులుతాడు” అన్నది జగమెరిగిన సత్యం... పైస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోతే, కిందిస్థాయి అధికారుల్లో చలనం ఉండదు, చర్యలు కేవలం రూపకల్పనగానే మిగిలిపోతాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకుంటారా.? లేక “పొయ్యిలో మంట ఉండగానే పొగ ఆర్పే ప్రయత్నం” చేస్తారా.? అన్నది కాలమే చెప్పాలి. మొత్తానికి, మహబూబ్‌నగర్‌ నగర కార్పొరేషన్ పరిధిలో పరిస్థితి ఒకే మాటలో చెప్పాలంటే ………………….. “కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” ఇప్పుడు నిర్ణయం అధికారులదే:....................... “కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతుంటే… చిన్నారులు ఇంట్లోనే బందీలు కావాలా.?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ నగరాన్ని ‘సురక్షిత నగరం’గా మార్చాలా… లేక ‘కుక్కల రాజ్యం’గానే వదిలేయాలా..? “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ స్పందన ఎప్పుడూ.?” అంటూ పట్టణ భద్రతపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రజల ఆవేదన అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్త గారు వెంటనే స్పందించి “వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం” చూపాలని కోరుతున్నారు. పట్టణంలోని ప్రతి డివిజన్‌లో ఉన్న వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర నుంచి మేల్కొని చర్యలు తీసుకుంటారా.? లేక సమస్యలు మరింత పెరిగిన తర్వాతే స్పందిస్తారా.? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠతో కూడిన అనుమానాలను రేకెత్తిస్తున్నాయి...

Sunder Chary

Admin

Kalam Power News

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :