Wednesday, 16 September 2026 05:39:07 AM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య

“టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు

Date : 25 March 2026 04:37 PM Views : 389

కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 25 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్‌నగర్ బస్టాండ్ సమీపంలోని ₹5 భోజన కేంద్రం వద్ద టెంట్ ఏర్పాటు అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, పేదలకు కనీసం తినే చోట నీడ కూడా కల్పించకపోవడం దారుణమని మండిపడ్డారు. భోజనం కోసం వచ్చే బడుగు, బలహీన వర్గాల ప్రజలు మండుతున్న ఎండలో ఇబ్బందులు పడుతుంటే, వారికి నీడ కల్పించాల్సిన బాధ్యత ఉన్న నాయకులు టెంట్ విషయంలోనే రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ***___---“నీడకూ అడ్డంకులా?”---___*** “పేదలు తినే చోట కనీసం టెంట్ వేయడానికి కూడా అడ్డంకులు సృష్టించడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్, ఇది ప్రజాసేవ కాదని, చిల్లర రాజకీయాలేనని తీవ్రంగా విమర్శించారు. ___---___“పేరు కోసం కాదు… సేవ కోసం పని చేయాలి”___---___ ఎవరు టెంట్ వేస్తే వారికి పేరు వస్తుందనే ఆలోచనతో అడ్డుకోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడమే ప్రధాన కర్తవ్యం కావాలని, పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం కావాలని స్పష్టం చేశారు. :::: ప్రజల్లో ఆగ్రహం :::: ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “ఒక ప్లేటు అన్నం తినే చోట కూడా రాజకీయాలు చేస్తే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి” అని వారు అంటున్నారు. “పేదల కోసం ఏర్పాటు చేసిన భోజన కేంద్రం వద్ద టెంట్ వేయడానికే ఇంత వివాదం అవసరమా?” అన్న ప్రశ్న ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో వినిపిస్తోంది. “అన్నం ఇస్తే సరిపోదు… నీడ కూడా ఇవ్వాలి” అనే సందేశాన్ని ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తోంది.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: