Wednesday, 15 April 2026 09:05:47 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

“కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?”

Date : 13 March 2026 09:34 AM Views : 958

కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 12 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది – “రాజేందర్ రెడ్డి ఓటమికి నిజంగా ప్రత్యర్థులే కారణమా… లేక పార్టీ లోపలివాళ్లేనా?” ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత రాజకీయాలను బహిర్గతం చేస్తున్నాయి. తాను పోటీ చేసిన 21వ డివిజన్‌లో ఓటమికి కొంతమంది కాంగ్రెస్ నాయకులే కారణమయ్యారని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో ఓటమి కొత్త విషయం కాదు. కానీ ఓటమి తర్వాత ప్రత్యర్థులపై కాకుండా తమ పార్టీలోని నాయకులపై వేలెత్తి చూపడం అంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై కూడా అసంతృప్తి ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయి. రాజేందర్ రెడ్డి ఇప్పటికే కొంతమంది నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదు చేశానని, వారిపై చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉందని పలు మీడియా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో కూడా స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం పార్టీ లోపలి అసంతృప్తిని మరింత బహిర్గతం చేసింది. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీతో పోరాడాల్సిన కాంగ్రెస్ నాయకులు… ఒకరితో ఒకరు పోరాడుతుంటే గెలుపు ఎలా వస్తుంది? అనే సందేహలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీని బలపరచాల్సిన నాయకులు అంతర్గత రాజకీయాల్లో బిజీగా ఉంటే కార్యకర్తలు ఎవరిని నమ్మాలి? ఎన్నికల సమయంలో ఒకే జెండా కింద నిలబడ్డ నాయకులు, ఎన్నికల తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సాధారణ కార్యకర్తల్లో కూడా సందేహాలను పెంచుతోంది. జిల్లా కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు రాజేందర్ రెడ్డి వ్యవహారంపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది – ఓటమికి బాధ్యులు ఎవరు.? కుట్ర చేసినవాళ్లు ఎవరు.? ఆపోజిట్ కాండిడేట్ కు పది లక్షలు పంపిన కాంగ్రెస్ నేత ఎవరూ.. ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నలు విమర్శలలో వాస్తవం ఎంత..? లేక ఇది కేవలం రాజకీయ ఆరోపణలేనా? ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలంటే పార్టీ లోపలి విభేదాలను పరిష్కరించకుండా “కాంగ్రెస్ కుటుంబం” అనే మాటలు చెప్పడం సులభం… కానీ ఆ కుటుంబంలో ఐక్యత నిలబెట్టడం అంత సులభం కాదు. రాజేందర్ రెడ్డి ఫిర్యాదుపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఈ వ్యవహారం ఇప్పుడు "ఒక వ్యక్తి ఓటమి కథ కాదు… మహబూబ్‌నగర్ కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత రాజకీయాల అసలు ముఖచిత్రం"గా మారుతోంది.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :