Wednesday, 16 September 2026 05:36:58 AM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య

ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం!

మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం!

Date : 14 March 2026 01:29 PM Views : 669

కలం పవర్ న్యూస్ - సోషియల్ మీడియా వైరల్ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 14 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై సివిల్ సప్లై అధికారులు ఒక్కసారిగా దాడులు ముమ్మరం చేయడం చర్చనీయాంశంగా మారింది. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ ల లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్‌గా వాడుతున్నట్లు గుర్తించి సీజ్ చేస్తున్నట్టు అధికారులు గొప్పగా ప్రకటిస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం ఒకే ప్రశ్న వినిపిస్తోంది. “ఇన్నాళ్లు ఇవి అధికారులకు కనిపించలేదా.?” వీరి కళ్ళల్లో మాముళ్ళ పొరలు కమ్ముకున్నాయిలే.. అని చలోక్తులు విసురుతూన్నారు.నెలలు, సంవత్సరాలుగా హోటళ్ల కిచెన్‌లలో డొమెస్టిక్ సిలిండర్లు “పర్మనెంట్ ఉద్యోగం” చేస్తున్నాయి. కానీ ఇప్పుడే ఒక్కసారిగా దాడులు జరుగుతుండటంతో ప్రజలు వ్యంగ్యంగా పలుకుతున్నారు. “రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా” అన్నట్లుగా ఇప్పుడు ఆగమేఘాల మీద దాడులు మొదలయ్యాయి కానీ ఇన్నాళ్లు మాత్రం ఈ అక్రమాలు ఎవరికీ కనిపించలేదా.? అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. “నెల నెల వచ్చే మమూల్ల మత్తులో అధికారులు జోగుతున్నారా… లేక అకస్మాత్తుగా నిజాయితీ మేల్కొన్నదా..?” అని ప్రశ్నిస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తుండగా, అదే సిలిండర్లు హోటళ్ల వంటగదుల్లో వాడటం వల్ల సాధారణ వినియోగదారులకు నష్టం జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు. అక్రమ వినియోగంపై అధికారులు నిజంగా కఠిన చర్యలు తీసుకుంటే ప్రజలు స్వాగతిస్తామని, కానీ కేవలం ఫోటోలకు పరిమితమైన దాడులు కాకుండా నిరంతర తనిఖీలు జరగాలని కోరుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులను చూసి “మమూల్లు ఆగితేనే తనిఖీలు మొదలవుతాయా?” ప్రజల భద్రత, న్యాయం కోసం ఈ తనిఖీలు కొనసాగుతాయా… లేక "కొన్ని రోజుల తర్వాత మళ్లీ పాత కథ మొదలవుతుందా?" అన్నది వేచి చూడాల్సి ఉంది.

Sunder Chary

Admin

Kalam Power News

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: