Thursday, 17 September 2026 01:35:37 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!.

బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!“బడ్జెట్‌లో లోటు ఉందో లేదో తెలియదు కానీ… కుర్చీల్లో మాత్రం ‘అధికం’ కనిపిస్తోంది!”

Date : 28 March 2026 12:46 PM Views : 649

కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 28 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థ బడ్జెట్ ప్రత్యేక సమావేశం ‘అంకెల యుద్ధం’గా కాకుండా ‘కుర్చీల కుస్తీ’గా మారింది. డయాస్‌పై ఐదు కుర్చీలు అమర్చడంతో, “డిప్యూటీ మేయర్‌కు కుర్చీ ఎందుకు?” అన్న ప్రశ్న సభలో చిచ్చుపెట్టింది. బడ్జెట్ పత్రాల కంటే కుర్చీల లెక్కలే ఎక్కువగా చర్చకు రావడం విశేషం. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ జ్యోతి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “ప్రోటోకాల్ ప్రకారం మేయర్‌కు మాత్రమే ప్రధాన స్థానముంటుంది. డయాస్‌పై అదనపు కుర్చీలు ఎందుకు?” అని నిలదీశారు. వెంటనే బీఆర్ఎస్ సభ్యులు బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించడంతో సభ వేడెక్కింది. ఇక కమిషనర్ రామానుజుల రెడ్డి స్పందిస్తూ, “చట్టాల్లో ఎక్కడా ‘ఎవరికెన్ని కుర్చీలు’ అనే స్పష్టమైన నిబంధన లేదు” అని చెప్పడంతో, చట్టం మౌనంగా ఉండగా రాజకీయాలు మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాయనే పరిస్థితి ఏర్పడింది. ::: చట్టం ఏమంటుంది? (లేదంటే… ఏమి చెప్పదు?) ::: నగర పాలక సంస్థల పనితీరును నియంత్రించే మున్సిపల్ చట్టాలు సాధారణంగా సభ నిర్వహణ, క్వారమ్, తీర్మానాలు, బడ్జెట్ ఆమోదం వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తాయి. అయితే: డయాస్‌పై ఎవరెవరు కూర్చోవాలి అనే విషయం ప్రత్యేకంగా పేర్కొనబడదు ఇది సాధారణంగా లోకల్ ప్రోటోకాల్ లేదా సంప్రదాయం ఆధారంగా నిర్ణయించబడుతుంది. మేయర్ సభాధ్యక్షుడిగా ఉండటం మాత్రమే చట్టపరంగా స్పష్టమైన అంశం అంటే… చట్టం కుర్చీలను లెక్కించదు, కానీ నాయకులు మాత్రం ఒక్క కుర్చీ కోసం కూడా లెక్కలు వేసుకుంటున్నారు! ::: కరీంనగర్ మోడల్… ‘ఒక్క కుర్చీ’ సిద్ధాంతం ::: కరీంనగర్ నగర కార్పొరేషన్‌లో అమలు చేస్తున్న పద్ధతిని ఉదాహరణగా చూపిస్తూ, “అక్కడ మేయర్‌కు మాత్రమే డయాస్‌పై కుర్చీ ఉంటుంది. మిగతావారు తమ స్థానాల్లోనే కూర్చుంటారు” అని బీఆర్ఎస్ సభ్యులు గుర్తు చేశారు. అయితే అధికారులు చెబుతున్నది వేరే కథ : అక్కడ అది చట్టబద్ధ నిబంధన కాదు, కేవలం అడ్మినిస్ట్రేటివ్ కన్వెన్షన్ (స్థానిక ఆచారం) అవసరాన్ని బట్టి ఇతర నగరాలు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అంటే… కరీంనగర్‌లో ‘ఒక్క కుర్చీ పాలసీ’, మహబూబ్‌నగర్‌లో ‘మల్టీ కుర్చీ మోడల్’! ::: బడ్జెట్ కంటే కుర్చీ బడా? ::: బడ్జెట్‌లో నగర అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సమస్యలు చర్చించాల్సిన సమయంలో… కుర్చీలే కేంద్రబిందువుగా మారడం రాజకీయ వ్యంగ్యానికి దారితీసింది. సభలో ఒక సభ్యుడు చమత్కరంగా, “బడ్జెట్‌లో లోటు ఉందో లేదో తెలియదు కానీ… కుర్చీల్లో మాత్రం ‘అధికం’ కనిపిస్తోంది!” అని వ్యాఖ్యానించారని సమాచారం. చట్టం చెప్పని చోట సంప్రదాయం అవగాహన అవసరం. కానీ ఇక్కడ మాత్రం కుర్చీ ఒక్కటే పెద్ద అంశంగా మారి, బడ్జెట్ చర్చే పక్కకు తప్పింది. మొత్తానికి… నగరాభివృద్ధి కంటే ‘ఎవరు ఎక్కడ కూర్చోవాలి?’ అన్నదే పెద్ద రాజకీయ అజెండాగా మారింది

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: