కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : జోగులాంబ జోన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎల్.ఎస్. చౌహన్, ఐపీఎస్ మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కవాతు మైదానంలో జరిగిన రక్తదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పోలీసు అమరవీరులకు స్మారకార్థంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలని డీఐజీ ఎల్.ఎస్. చౌహన్ పిలుపునిచ్చారు. అత్యవసర సందర్భాల్లో రక్తం అందుబాటులో లేకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, అందుకే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఎంతో అవసరమని ఆయన ప్రస్తావించారు. పోలీస్ సిబ్బంది మాత్రమే కాకుండా, ఇతర పౌరులు కూడా రక్తదానం కార్యక్రమంలో పాల్గొనడం సమాజానికి సేవ చేయడమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్, అదనపు ఎస్పీ రాములు, ఎ ఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డిసి అర్బి డీఎస్పీ రమణా రెడ్డి, ఎ అర్ డీఎస్పీ శ్రీనివాసులు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, ఆరై కృష్ణయ్య, అర్ ఐ రవి అర్ ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Kalam Power News