కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు మున్నభాష ఆదేశానుసారం జిల్లా సెక్రెటరీ ఇమాముద్దీన్, మండల అధ్యక్షుడు ఎండి రఫీ ఆధ్వర్యంలో రాజీవ్ మార్లో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం మోమిన్ మహల్లా లో ఉన్న ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్లో పిల్లలతో కలిసి అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. అనంతరం విద్యార్థినులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా సెక్రెటరీ ఇమాముద్దీన్ మరియు మండల అధ్యక్షులు ఎండి రఫీ మాట్లాడుతూ...నేటి సమాజంలో ప్రతి ఒక్క కుల నాయకున్ని ఆ కులం వారు ఎంతో గౌరవించి ఆ నాయకుల వర్ధంతులు జయంతులు ఘనంగా చేస్తూ ఉంటే ముస్లిం సామాజిక వర్గ నాయకులు మాత్రం ముస్లిం సామాజిక వర్గమే లేనట్లు మరచిపోయి పరాయి నాయకుల వెంట పరుగులు తీస్తున్నారు.ఇలా ప్రవర్తిస్తున్నందుకు ముస్లిం సామాజిక వర్గమే సిగ్గుపడాలి. సోషల్ మీడియాలో ఘోరంగా అవమానిస్తు పోస్టులు పెడుతున్న నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్న మన పెద్ద పెద్ద నాయకులు. అదే వేరే కులాన్ని ఒక్క మాట ఎవరైనా అంటే ఆ కులమంతా ఒక్కటై అన్నవారి తోలు తీస్తారు. ముస్లిం సామాజిక వర్గంలో ఐక్యతలోపించింది అన్నారు.ముస్లిం సామాజిక వర్గం మేలుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. మన కులం ఐక్యత వర్ధిల్లాలి మనమంతా ఒక్కటే అని చాటి చెప్పాలన్నారు. ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద నాయకుని వర్ధంతి గాని జయంతి గాని అధికారికంగా చేయాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం ఫారుక్ పాషా, అన్వారే మజీద్ అధ్యక్షులు ఎస్.కె సైజాద్. ఆర్కే షఫీ, ఫయుమ్బెగ్, మొహమ్మద్, జుబేర్ అబ్దుల్ రహీం. జాఫర్ అంజాద్. అస్లాం. తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News