కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కె.లక్ష్మణ్ యాదవ్ ముడా కార్యాలయంలో బుధ వారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక మరియు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టి పిసిసి ప్రదాన కార్యదర్శి వినోద్ కుమార్, మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ తదితరులు ముడా చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు , ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Kalam Power News