కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : సీ ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా పోయిన 459 మొబైల్ ఫోన్లు కనుగొని సంబంధిత వ్యక్తులకు అందించినందున జడ్చర్ల పోలీసు స్టేషన్ రాష్ట్ర స్థాయిలో 6 వ స్థానం లభించింది. ఈ సందర్భంగా జడ్చర్ల ఇన్స్పెక్టర్ ఆది రెడ్డి ని డీజీపీ కార్యాలయానికి పిలిచి రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రశంసించారు. రాష్ట్ర స్థాయిలో జడ్చర్ల పోలీస్ స్టేషన్ కి 6వ స్థానం వచ్చినందున, జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ఆది రెడ్డి ని ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మొబైల్ ఫోన్లు కనుగొనడం, వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగించడం ద్వారా ప్రజలకు మంచి సేవను అందించారు. ఫోన్ మిస్ అయిన పేద మరియు మధ్యతరగతి కుటుంబాల వారికి ఇది చాలా ఊరట కలిగించే విషయం అని ఎస్పీ అన్నారు.
Admin
Kalam Power News