కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈనెల 22 నుండి అంగరంగ వైభవంగా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ ఆలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని హైదరాబాదులో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి సన్మానించి ఆహ్వాన పత్రికలను అందజేశారు ఉత్సవ కమిటీ అధ్యక్షులు గందె రవి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాస శేఖర్, కంది ప్రవీణ్, పాపిశెట్టి శ్రీనివాస్, ముత్యాలు, వేణు, వీరేష్, దుగ్గి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News