కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : జోగులమ్మ గద్వాల జిల్లా, గద్వాల్ మండల కేంద్రంలోని అనంతపురం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీయుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లను వెంటనే సస్పెండ్ చేయాలని పీ డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్ చేశారు. విద్యాబుద్ధులు నేర్పవలసిన ఒక ప్రధానోపాధ్యాయులు స్కూల్లో విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పలకల మీద పిచ్చిగా రాతలు రాపిస్తూ అమ్మాయిలను టచ్ చేస్తూ గిల్లుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయున్ని శిక్షించాలన్నారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెచ్ఎం వెంకటేశ్వర్లు పై గ్రామస్తులు దేహ శుద్ధి చేశారు. ఈ సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్న ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఈ విషయాన్ని పూర్తిగా చేసి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Admin
Kalam Power News