Friday, 18 September 2026 09:36:59 AM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

సామాజిక సేవలో వాసవి క్లబ్ లకు తిరుగులేదు : క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్

Date : 02 March 2024 08:11 PM Views : 1109

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు తిరుగులేదని, క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సేవలకు రాష్ట్రపతి గుర్తింపు కూడా పొందడం గొప్ప విషయమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ అన్నారు. శనివారం ఆయన కల్వకుర్తి క్లబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ లో నిర్మించిన సరస్వతి మాత ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. అనంతరం వాసవి క్లబ్ భవనంలో కల్వకుర్తి వాసవి క్లబ్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయన్నారు. ఎన్నో సంస్థలు చేస్తున్న సేవలకు విభిన్నంగా సేవలందించడం తమకే చెందిందన్నారు. ఈ సంవత్సరం వాసవి క్లబ్ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ప్రధానంగా విద్య వైద్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం 20 మంది పేదలకు బియ్యం చీరలను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని రవిచంద్రన్ కోరారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తదుపరి క్లబ్ గవర్నర్ జగదీష్ వాసవి వనిత క్లబ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా చిదిరె శ్రీనివాసులు శ్రీలక్ష్మి, కార్యదర్శులుగా కల్వ లక్ష్మి ఆంజనేయులు, కోశాధికారిగా దుగ్గి ధనలక్ష్మి అశోక్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కల్వ హరికృష్ణ, కలిమిచర్ల రమేష్, జూలూరి సత్యం, చిగుళ్లపల్లి శ్రీధర్, నీల లింగం, కొండూరు కృష్ణయ్య, యాద శోభన్ బాబు, శివ రాఘవేందర్, పిఎస్ఎన్ గుప్తా, నామ ఆనంద్ కుమార్, మురళి, పరమేష్, రామనాథం వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: