కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కల్వకుర్తి లోని కెసిఆర్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఉదయం 5 గంటల నుండి నృసింహస్వామి ఉపాసకులు శ్రీ సోమిషెట్టి నాగరాజు స్వామి గారి మార్గ నిదేశకత్వంలో 54 హోమగుండాలతో 162 జంటలతో ఘనంగా నిత్య తిరువారాదన , భక్తులచే అష్టోత్తర కలశ పూజ, మహాలక్ష్మి యాగం, లక్ష్మి నృసింహ స్వామి కళ్యాణం కార్యక్రమాలు జరిపించారు, ఈ యాగ కార్యక్రమం లో జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు జూలూరి రమేష్ బాబు పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి టీటీడీ ఆస్థాన యజుర్వేద అధ్యాపకులు సుందర ప్రహ్లాద భట్టర్ ఆచార్య వారు విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు, మరియు యాగ నిర్వాహకులను సహయకులను రుత్వికులను కొనియాడారు, తదుపరి తీర్థ ప్రసాద మరియు అన్న ప్రసాద వితరణ జరిగింది, ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కసిరెడ్డీ నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, పట్టణ కౌన్సిలర్ సతీష్ పాల్గొనటం జరిగింది, ఇట్టి కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు శ్రీ మహాలక్ష్మి యాగ కమిటి సభ్యులు జూలూరి ప్రకాష్ , అప్పయపల్లి శ్రీనివాసుల, గంధం ప్రసాద్, మచిపెద్ది అశోక్ , బాదం రాఘవేందర్, జూలూరి విరేశ్ , కంది ప్రవీణ్ , కలిమిచెర్ల గోపాల్, బాదం హరీష్ , మాచిపెద్ధి రవి, దుగ్గి వెంకటేష్ , తదితరులు కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది.
Admin
Kalam Power News