కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవలందించడంలో అగ్రభాగాన నిలిచే సామాజిక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేష్ బాబు అన్నారు. ఆదివారం వనస్థలిపురం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన డిస్టిక్ వి 102 ఏ రీజియన్ 2 శ్రీశైల భ్రమరాంబిక సేవ పురస్కార వైభవం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీజియన్ పరిధిలోని వాసవి క్లబ్ల ద్వారా చేపట్టిన సామాజిక సేవలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో సేవలను అందించడం గొప్ప విషయం అన్నారు. సేవలతోనే సార్ధకత లభిస్తుందని రమేష్ బాబు చెప్పారు. సామాజిక సేవ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని తోటి వారికి సహాయం అందించే గుణం తో మెలగాలని రమేష్ బాబు కోరారు. వాసవి క్లబ్ ఐ ఈ సి ఆఫీసర్ విఠ దురయ్య మాట్లాడుతూ సేవలకు వన్నె తెచ్చేది వాసవి క్లబ్ లు మాత్రమే అన్నారు.వి 108 ఎలెక్ట్ గవర్నర్ కల్మీచర్ల రమేష్, 102ఏ గవర్నర్ అల్లాడి పరమేశ్, అబ్సర్వర్ నవీన్, కొత్త మాసు రమేష్ , ఉప్పల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ మద్ది శివ నాగేశ్వరరావు, సరస్వతి రీజియన్ పరిధిలోని వాసవి క్ల బ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలత ఆలయంలో రమేష్ బాబు ప్రత్యేక పూజ నిర్వహించారు.
Admin
Kalam Power News