కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : సమాజంలో సామాజిక సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి అగ్రగామిగా కొనసాగుతున్నదని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ జూలూరు రమేష్ బాబు కితాబు ఇచ్చారు. బుధవారం క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు 300 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే వందల కోట్ల రూపాయలు సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాత్ర గొప్పదన్నారు. ఎంతోమందికి కంటి చికిత్సలు నిర్వహించి ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారని తెలిపారు. లైన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో మరిన్ని సేవలందించాలని రమేష్ బాబు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడుబచ్చు రామకృష్ణ మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాలకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలు అందిస్తున్నారు. సేవలకు ప్రత్యేకం లైన్స్ ఇంటర్నేషనల్ అన్నారు. క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కల్మిచర్ల రమేష్ మాట్లాడుతూ సేవలతోనే సార్ధకత లభిస్తుందన్నారు. జూలూరు రమేష్ బాబు జన్మదిన సందర్భంగా పేదలకు భోజనం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షుడు చిగుళ్లపల్లి శ్రీధర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కల్మచర్ల గోపాల్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బా కిషన్, పోలా రాజేందర్,అప్పయ్యపల్లి శ్రీనివాస్, జూలూరు సత్యం, జూలూరు ప్రకాష్, పాలకూర రవి గౌడ్, గణేష్ దార మౌని, శివ్వా జగదీశ్వర్, గోవిందు చంద్రయ్య, బాదం రాఘవేందర్, గుగ్గిలాషంకర్, జూలూరు సాయిబాబు, నారాయణ రాజు తదితరులతోపాటు పలువురు పాల్గొన్నారు.
Admin
Kalam Power News