కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదామని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మిడ్జిల్ మండల కన్వీనర్ మంద భీమ్ రాజ్ కోరారు. ప్రతి సంవత్సరం లాగానే మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా లక్ష్మన్న అభిమానులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జడ్చర్ల పట్టణంలో కల్వకుర్తి రోడ్డులో ఉన్న ప్రేమ్ రంగా గార్డెన్ లో సోమ వారం నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని బిఆర్ఎస్ పార్టీ మిడ్జిల్ మండల సోషల్ మీడియా మండల కన్వీనర్ మంద భీమ్ రాజ్ కోరారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఎందరో రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రమాదానికి గురైన వారికి సరైన సమయం రక్తం దొరకక ఎందరో మరణిస్తున్నారు కావున రక్తదానం చేసి ప్రాణపాయ పరిస్థితులు ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు లక్ష్మన్న సైన్యం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని మనవి చేశారు.
Admin
Kalam Power News