కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : క్రీడలతోపాటు చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యం అవుతుందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ జూలూరు రమేష్ బాబు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ఆటల పోటీలను నిర్వహించారు. మంగళవారం పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో బహుమతి ప్రధాన ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమేష్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువుతో జ్ఞానం సంపాదించవచ్చని ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచే అవకాశం విద్యు తోనే వస్తుందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలతోపాటు చదువులోనూ రాణించి తమ కుటుంబాలకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని రమేష్ బాబు కోరారు. లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు కలిమిచర్ల రమేష్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలకు లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులను 150 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి శ్రీనివాస్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ కిషన్, సభ్యులు గణేష్, రవి గౌడ్, ప్రధానోపాధ్యాయురాలు ప్రసూన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News