కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 5 రోజు ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం సుప్రభాత సేవ, అభిషేకాలు, దంపతలచే సామూహిక కుంకుమార్చన,వేద పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, సాంసృతిక కార్యక్రమలు, సుధాకర్ రావు ధ్యానం వల్ల ఉపయోగం గురించి అవగాహన కల్పించారు. డిప్యూటీ తహశీల్దార్ రాఘవేంద్రర్ రెడ్డి ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆనంతరం దేవాలయం చైర్మన్, ఉత్సవ కమిటీ అయినను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఆనతరం నైవేద్యం సమర్పించడం పెద్ద మంగళహారతి ఆనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి లు తెలిపారు. ఆదే విధంగా సాయంత్రం 6 గంటలకు సత్య సాయి సేవా బృందం చే రుద్రాభిషేకం కార్యక్రమం ఉంటుంది అని, కోలాటాలు, దాండియా మంగళ హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి, కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి లు గుండ్ల రేవంత్,డి నితిన్, కోశాధికారి లు పి గిరిబాబు, సంబ తరుణ్, ఆర్యవైశ్య మహాసభ సంఘం మండల పట్టణ అధ్యక్షులు ఆర్యవైశ్య అనుబంధ సంఘాల నాయకులు సభ్యులు మహిలలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప ఆశీస్సులు పొందారు.
Admin
Kalam Power News