కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ డి జానకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... తెలంగాణ ఉత్పకారిణి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్రా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. చాకలి ఐలమ్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న జరుపుకుంటారు. చాకలి ఐలమ్మ తెలంగాణా ప్రాంతంలో జాతిపరమైన విముక్తి పోరాటంలో ప్రముఖంగా నిలిచిన మహిళా నాయకురాలు. ఆమె తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో, జమీందారీ వ్యవస్థ మరియు నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, సామాజిక న్యాయం కోసం ప్రతీకగా నిలిచారు. ఆమె జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ, ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటారు, ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో, మహిళా సాధికారత మరియు సామాజిక న్యాయం కోసం ఆమె అందించిన కృషిని గుర్తుచేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, ఎ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డిసిఆర్బి డీఎస్పీ రమణా రెడ్డి, ఎ ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, వర్టికల్ డీఎస్పీ సుదర్శన్, ఎస్బి ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఆర్ ఐ కృష్ణయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Kalam Power News