కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాల కార్యక్రమాలపై ముద్రించిన పుస్తకాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. తొలత అమ్మవారి కి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నుండి ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన చెప్పారు. మొదటిరోజు అమ్మవారిని ధాన్య లక్ష్మీదేవి అలంకరణ లో అలంకరిస్తున్నామని వెల్లడించారు వేకువ జామున 5 గంటల నుండి ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాల తో అలంకరించడంతోపాటు పట్టణ ముఖ్య కూడలలో మైకులను ఏర్పాటు చేసి దేవాలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలను భక్తులకు, పట్టణ వాసులకు తెలిసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ప్రతినిత్యం ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు జూలూరు రమేష్ బాబు చెప్పారు. అక్టోబర్ 2న దసరా పండుగ, 4న అమ్మవారి ఊరేగింపు అవబ్రృద స్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గంధం ప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాస శేఖర్, మాజీ ఎంపిటిసి కల్మిచర్ల గోపాల్, ఉత్సవ కమిటీ కార్యదర్శులు గుండ్ల రేవంత్, దాచేపల్లి నితిన్, కోశాధికారులు గిరిబాబు, తరుణ్, గంప వెంకటేష్, ముత్యాలు, కిషన్, ప్రవీణ్, అప్పయ్యపల్లి శీను, సామల నరసింహ, కృష్ణయ్య, శంకర్ తదితరులతోపాటు పలువురు పాల్గొన్నారు.
Admin
Kalam Power News