Tuesday, 21 April 2026 05:48:40 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

ఉదండాపూర్ లో బీఆర్ఎస్ అక్రమాల దందా • నిర్వాసితుల జాబితాలోకి 300 బోగస్ కుటుంబాలు . ప్రభుత్వ భూములు తమనేనంటూ పరిహారాలు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Date : 25 September 2024 02:51 PM Views : 883

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : ఉదండాపూర్ లో నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చే ప్యాకేజీ కోసం 300 బోగస్ కుటుంబాల పేర్లు రాయించి పరిహారాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న వారిని, ప్రభుత్వ భూములకు అక్రమంగా పరిహారాలు తీసుకున్న వారెవరినీ జైలుకు పంపకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు బుధవారం ఇద్దరు మంత్రులు విచ్చేసిన నేపథ్యంలో ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద అనిరుధ్ రెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇవ్వాల్న నిధుల్లో రూ.45 కోట్లను ప్రభుత్వం మంగళవారం రాత్రి నిర్వాసితుల అక్కౌంట్లలోకి జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. అయితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నిర్వాసితులు కోరుతున్న విధంగా రూ.25 లక్షలకు పెంచకుండా రూ.16.30 లక్షల రుపాయలనే వారి ఖాతాల్లోకి జమ చేసారని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను పాత్రికేయులు ప్రస్తావించగా, ఆ 16 లక్షల ప్యాకేజీని కూడా గత రెండేళ్లుగా బీఆర్ఎస్ నాయకులకు చేతకాకపోయిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల ప్రభుత్వకాలంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిపెట్టి వెళ్లిన నేపథ్యంలో ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను రెండేళ్ల తర్వాత చేయాలని ప్రభుత్వం భావించినా తాను పట్టుబట్టి పనులు వెంటనే చేపట్టాలని కోరానని, ఈ కారణంగానే ప్రభుత్వం పనులను ప్రారంభిస్తూ తొలివిడతగా రూ.45 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇంకా రూ.800 కోట్ల వరకూ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ పట్ల నిర్వాసితులు ఆనందంగానే ఉన్నారని అయితే రిజర్వాయర్ ప్రాంతంలో ఫిల్టర్ ఇసుకను తయారు చేసి అమ్ముకొనే వారు, కాంట్రాక్టర్ ను బెదిరించి కమీషన్లు వసూలు చేసుకొనేవారు మాత్రమే ప్రజలను రెచ్చకొట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ఫిల్టర్ ఇసుకను ఎవరూ అమ్ముకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. రిజర్వాయర్ ప్రాంతంలో ఫిల్టర్ ఇసుక, గ్రావెల్ అమ్మకాలను అడ్డుకోవడానికి, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేసే వారిని నిరంతరం కనిపెట్టడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను ప్రారంభిస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాల కారణంగా ఉదండాపూర్ నాశనమైయిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఆ గ్రామంలో నివాసం లేని 300 మంది పేర్లను నిర్వాసితుల జాబితాలో చేర్పించారని, వారికి నిర్వాసిత కుటుంబాలుగా ప్రభుత్వం ఇచ్చే రూ.16 లక్షల పరిహార మొత్తం లేదా వారికి ఇచ్చే ప్లాట్ లలో ఏదో ఒకటి తమకు ఇవ్వాలని ఆ బోగస్ కుటుంబాలతో బీఆర్ఎస్ నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. అలాగే ప్రభుత్వానికి చెందిన భూములు కూడా తమవిగా రికార్డుల్లో మార్పించి ఆ భూములకు చెందిన పరిహార మొత్తాలను కూడా అక్రమంగా తీసుకున్నారని చెప్పారు. భూమి ఒకరిదైతే పరిహారం ఆ భూమికి సంబంధం లేని ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించి ఆ డబ్బును కూడా బీఆర్ఎస్ నేతలే స్వాహా చేసారని అనిరుధ్ రెడ్డి ధ్వజమెత్తారు. 300 బోగస్ కుటుంబాలను ఉదండాపూర్ జాబితాలోకి చేర్చి పరిహారం తీసుకోవాలని ప్రయత్నిస్తున్న వారిని, ప్రభుత్వ భూములు తమవేనంటూ అక్రమంగా పరిహారం పొందిన వారినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. ఉదండాపూర్ నిర్వాసితుల పేరుతో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాను అసెంబ్లీలో కూడా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసారు. తాను కమీషన్లు తినే ఎమ్మెల్యేను కానని, అక్రమాలను తాను సహించబోనని పేర్కొన్నారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఐదేళ్లలోపుగా పూర్తి చేస్తామని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :