కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థినీ భాగ్యలక్ష్మీ యం బి బి ఎస్ చదువుకు వైద్య విద్యార్థులు అండగా నిలిచారు. మహబూబ్ నగర్ సింహగిరికి చెందిన నిరుపేద నాయీ బ్రాహ్మణ కుటుంబమైన లావణ్య , వెంకటేశ్ దంపతుల కుమార్తె భాగ్య లక్ష్మీ నీట్ -2024లో ఉత్తమ ర్యాంక్ తో సిద్దిపేట లోని సురభి మెడికల్ కాలేజ్ లో యం బి బి ఎస్ సీటు సాధించింది. యం బి బి ఎస్ లో అడ్మిషన్ కు రూ.ఒక లక్షా 40 వేల రూపాయల అవసరం కాగా పూట గడవని తల్లి దండ్రులు అంత పెద్ద మొత్తంలో డబ్బు ను సమకూర్చే పరిస్థితి లేని విషయాన్ని తెలుసుకున్న పి ఆర్ టి యూ టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్ర శేఖర్ తనయుడు వైద్య విద్యార్థి మెడి సర్కిల్ ఫౌండర్ అశ్విని నవదీప్ తన సహచర వైద్య విద్యార్థుల సహకారంతో రూ 45వేల రూపాయల నగదును భాగ్యలక్ష్మీ కి అందజేశారు. అంతే కాకుండా భాగ్య లక్ష్మీ నాలుగేళ్ల యం బి బి ఎస్ కోర్సుకు అవసరమైన వైద్య పుస్తకాలను తెలుగు రాష్ట్రాలకు చెందిన మెడికల్ ఇన్ ప్లుయెన్సర్ల తరఫున అందజేస్తామని మెడి సర్కిల్ ఫౌండర్ అశ్విని నవదీప్ తెలిపారు. అదే విధంగా వైద్య విద్యా ప్లాట్ ఫారమ్ ల సబ్ స్క్రిప్షన్ లు, మెడికల్ కాన్ఫరెన్స్ , ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫీజులు సైతం సామాజిక బాధ్యత గా అందజేస్తామని తెలిపారు. ఈ విధంగా పేదింటి బిడ్డ యం బి బి ఎస్ చదువుకు వైద్య విద్యార్థులు చేయుతనివ్వడం అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. *అశ్విని నవదీప్ ను అభినందించిన ఎమ్మెల్యే యెన్నం* భాగ్య లక్ష్మీ యం బి బి ఎస్ చదువుకు చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చిన వైద్య విద్యార్థులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. భాగ్య లక్ష్మీ ఆర్థిక కష్టాలను గుర్తించి సహచర వైద్య విద్యార్థుల సహకారం తో రూ: 45 వేల రూపాయల నగదు ను సమకూర్చి అంద జేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వైద్య విద్యార్థి , మెడి సర్కిల్ ఫౌండర్ అశ్విని నవదీప్ ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి అభినందించారు. హన్మకొండ లోని యం బి బి ఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అశ్విని నవదీప్ తన వైద్య విద్యను అభ్యసిస్తున్న మిత్రులతో కలసి పేదింటి బిడ్డ కు చేయూత నివ్వడం అభినంద నీయమని ఎమ్మెల్యే అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా సామాజిక స్ఫూర్తి కలిగిన అశ్విని నవ దీప్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్, రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజు, వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాముల్, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ రమణయ్య, మేనేజర్ నర సింహా నవదీప్ ను ప్రత్యేకంగా అభినందించారు.
Admin
Kalam Power News