కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : ఆర్యవైశ్య మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఎన్నం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. మొదట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉసిరిక చెట్టుకు పూజలు నిర్వహించి, మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతిఅల్వాల్ రెడ్డి, తహసీల్దార్ రాజు, ఆర్ఐ అంబిక లు హజరైయ్యారు. ఆర్యవైశ్యులు ఇతరులకు సేవ చేసి ఆదర్శంగా ముందుకు సాగుతున్నారని.. వారు చేసే సేవ కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతిఅల్వాల్ రెడ్డి, తహసీల్దార్ రాజు, ఆర్ఐ అంబిక, పలువురు పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు. వనమహోత్సవ కార్యక్రమానికి ఆర్థిక సహాయము చేసిన ఆర్యవైశ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఎన్నం సత్యనారాయణ గుప్తా, వాసవి క్లబ్ మండల అధ్యక్షురాలు ఎన్నం కళ్యాణి, నాయకులు మూర్తి, విజయ్ కుమార్, జూలురి యాదగిరి, కొత్త శ్రీనివాస్ గుప్తా, సింహ్మయ్యగుప్తా, డాక్టర్ రమేష్ బాబు, దత్తాత్రేయులు, నాగేష్, ఆంజనేయులు గుప్తా, మిడిదొడ్డి శ్రీనివాసులు, చంద్రయ్య, మల్లేష్, మిర్యాల శ్రీనివాసులు, విశ్వ నాథం సుధాకర్, సత్యం, వెంకటేష్, నరేష్ లతో తదితరులు పాల్గొన్నారు
Admin
Kalam Power News