కలం పవర్ న్యూస్ - తెలంగాణ / పాలమూరు : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో గ్రూప్-3 పరీక్ష రాసెందుకు వచ్చిన ఓ విద్యార్థిని పరీక్ష సమయానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉండటం తో పరుగులు పెడుతూ కేంద్రం సమీపం లో చేరుకొని .. శక్తి లేక నీరసంతో కేంద్రానికి పది అడుగుల దూరంలో కింద పడబోతుండగా.. ఆపన్న హస్తం లా మఫ్తిలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఏ ఎస్ ఐ వెంకట్రములు ఆమెను కిందపడకుండా మెరుపువేగంతో కాపాడారు. మరోవైపు పరీక్ష కేంద్ర గేట్లు మూసివేస్తుడం తో ఆమెను కేంద్రం లో పంపించి మహిళా పోలీస్ లతో మంచినీటిని అందించారు. ఇంకో అభ్యర్థిని కూడా ఒక పరీక్ష కేంద్రానికి బదులు ఇంకో పరీక్షా కేంద్రానికి వచ్చి టెన్షన్ పడుతుంటే అది గమనించిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య HC1369 సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చడం జరిగింది. ఒక్క క్షణం ఆలస్యం అయిన ఆ అభ్యర్తులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయెవారూ. పరీక్షా కేంద్రం లోపలి వెళ్ళిన ఒక నిమిషం తేడాతో అధికారులు గేట్లు మూసివేయడం జరిగింది. 9.30 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను అధికారులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. పోలీస్ లు అంటేనే కాఠిన్యం అంటారు.. కాని వారిలో కాఠిన్యం మాటున కరుణ దాగి ఉంటుందని ఈ ఘటన కళ్లకు కట్టింది. వీరి ఇరువురి సేవలు ప్రశంసనీయమైనవి. అభ్యర్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి సహాయ చర్యలు అత్యంత ముఖ్యమైనవి. స్పెషల్ బ్రాంచ్ ఏ ఎస్ ఐ వెంకట్రాములు మరియు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య (HC 1369) ల ను జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ప్రశంసించారు.
Admin
Kalam Power News