కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఇంటర్మీడియట్ ఫలితాలలో రిషి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలు సాధించి పాలమూరు విద్యా ఖ్యాతిని పెంచారు. ఈ సందర్భంగా రిషి జూనియర్ కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్ మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలలో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. తమ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో మొదటి సంవత్సరం విభాగం నుంచి MPC నందు M. భావన 468/470, 7 గురు విద్యార్థులకు 467/470 మార్కులు, బైపిసి నందు మలిహ కహేకశ 438/440, 3 గురు విద్యార్థులకు 437/440 మార్కులు, 3 గురు విద్యార్థులకు 436/440 మార్కులు సాధించారు. అలాగే రెండవ సంవత్సరం విభాగం నుండి ఎంపీసీ నందు టి.మేఘన 993/1000, 5 గురు విద్యార్థులకు 990/1000 పైగా మార్కులు, బైపిసి నందు మలిహ తహనియత్ 992/1000 మార్కులు, 5 గురు విద్యార్థులు 990/1000 పైగా మార్కులు సాధించారని కళాశాల యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్, అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రసన్నలక్ష్మి, రాఘవేంద్ర రావు మరియు అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
Admin
Kalam Power News