కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గత పది రోజులుగా వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం శ్రీ మహిషాసుర మర్ధిని దేవి అలంకరణలో భక్తులకు అమ్మవారి దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవ అభిషేకాలు దంపతలచే కుంకుమార్చన, భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం, చండీ మహా హోమం నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి లు తెలిపారు. ఈ రోజు అమ్మవారిని జిల్లా పౌరసరఫరాల అధికారులు డిఎస్ ఓ నర్సింగ్ రావు, డిఎం రాజేందర్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర ర్ రెడ్డి కి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరందరినీ దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి, ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా మెమెంటో తో సన్మానం చేశారు. హిందూ ఐక్య వేదిక సంఘం సభ్యులు దసర పండుగ గురించి, హిందూ సంస్కృతి సంప్రదాయాల గురించి అవగాహన కల్పించారు. సంప్రదాయ బద్ధంగా దుస్తులు అలంకారం తో దేవాలయానికి వచ్చిన మహిళలకు బహుమతులు దాత రాచూరు రాంమోహన్ సహకారంతో అందజేశారు. ఆదే విధంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి కి బంగారు కిరీటం కోసం దొంతు రాంమోహన్ తులం బంగారం,గుండ మధుసూధన్ అర్థ తులం బంగారం ఇవ్వడం జరిగింది అని వారిని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆనతరం పెద్ద మంగళ హారతి దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం కోలాటాలు దాండియా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి, ఉత్సవ కమిటీ సలహాదారు వాస శేఖర్, కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండ్ల రేవంత్, డి నితిన్, కోశాధికారి లు పోల గిరిబాబు, సంబ తరుణ్ లు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు సభ్యులు, మహిళలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Kalam Power News