కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా, చిన్న చింతకుంట మండలం, దమగ్నాపూర్ లో ఆది వారం దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి తండ్రి స్వర్గీయ గవినోల్ల కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఎం ఎల్ ఏ మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి తండ్రి జి.కృష్ణా రెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా దగ్నాపూర్ చేరుకొని దేవరకద్ర శాసనసభ్యుల స్వగృహంలో నిర్వహించిన 12 రోజుల దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి .చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్స్ సురభి, జిల్లా ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్. మోహన్ రావు, అడిషనల్ ఎస్పీ రాములు, శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ,మెఘా రెడ్డి ,డాక్టర్ వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, చిట్టెం ఫర్ణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, కూచకుళ్ల రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత,మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News