కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయం లో శుక్రవారం ఆర్యవైశ్య మహాసభ మహిళ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో పదవతరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మంచి ప్రతిభ కనబరిచిన 10 మంది పదవతరగతి,10మంది ఇంటర్మీడియట్ ద్వితీయ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ మహళ సంఘం, యువజన విభాగం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించడం అభినందనీయం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.మహసభ పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్ మాట్లాడుతూ భవిష్యత్ లో మరింత మందికి ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మహిళ సంఘం అధ్యక్షురాలు గోవిందు మౌనిక, యువజన విభాగం అధ్యక్షుడు సంబు తరుణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిలు కోండురు కృష్ణయ్య, గార్లపాటి శ్రీనివాసులు, అధనపు ప్రధాన కార్యదర్శి దొంతు శ్రీనివాసులు, మండలం, పట్టణం కోశాధికారి లు ఆకుతోట రవి, జూలూరి వీరష్, మహిళా ప్రధాన కార్యదర్శి రాణి, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గిరిబాబు, కోశాధికారి గుండల రేవంత్, నితిన్, సంఘం నాయకులు గుండ కృష్ణయ్య, జూలూరి ప్రకాష్, శోభన్ బాబు, మహిళా సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News