కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సోమవారం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతం, అభిషేకాలు,వేద పారాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం, భక్తుల చే పల్లకి సేవ,దంపతలచే సామూహిక కుంకుమార్చన, దేవతలకు నైవేద్యం సమర్పించడం,పెద్ద మంగళహారతి, ఆనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమాలు మొదటి రోజు నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయం చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ, ఆర్యవైశ్య అనుబంధ సంఘాల దాతల సహకారంతో ఘనంగా ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, సాంసృతిక కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండల రేవంత్,డి నితిన్, కోశాధికారి లు సంబు తరుణ్,పోల గిరిబాబు, ఆర్యవైశ్య మహాసభ సంఘం మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, ఆర్యవైశ్య మహాసభ సంఘం సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు, మహిళలలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. సాయంత్రం నాదస్వర విన్యాసం, కోలాటాలు, దాండియా తోపాటు మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు వితరణ కార్యక్రమాలు ఉంటాయి అని దేవాలయం చైర్మన్ రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి కమిటీ సభ్యులు తెలిపారు.
Admin
Kalam Power News