కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : నవంబర్ 30న జరిగిన ఎన్నికల పోలింగ్ లో బిఆర్ఎస్ పార్టీకే ప్రజలు మరోసారి పట్టంగడుతున్న నేపథ్యంలో తిరిగి మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ సమాలోచనలు జరిపారు. అందులో భాగంగా మూడోసారి ముఖ్యమంత్రి డా. బిఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం తేదీ, సమయం కోసం పురోహితులతో సీఎం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఏ ఫైల్ పై తొలి సంతకం చేయాలనే అంశం లో చర్చించిన సీఎం అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే ఫైలు పై తొలి సంతకం చేయనున్నారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ పేరుతో అధికారం పోతుంది అని మీడియా ఆగం చేస్తున్నప్పటికీ, లక్షలాది కార్యకర్తలు ఊపిరి బిగపట్టుకుని 3 న ఎం జరుగుతుంది అనే ఉత్కంఠలో ఉండగా, 4 న కేబినేట్ భేటీ అని చెప్పి కొండంత ధైర్యాన్ని నూరి పోసిన కేసీఆర్. ముచ్చటగా మూడవసారి సీఎం గా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రగతిభవన్ ను ముస్తాబు చేయించడం, కొత్త రంగులు వేయించడంతోనే ఆయన లెవెల్ వేరు అని స్పష్టమవుతుంది. పెద్దాయన పెద్దాయనే ఉత్తగనే తెలంగాణ రాలేదు నిజంగా ఉక్కు గుండెనే ఆయనది. ఇప్పుడు 60 లక్షల గులాబీ సైన్యానికి కావాల్సిన దైర్యం ఇదే కదా..!!
Admin
Kalam Power News