కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : ఉదయం సుప్రభాత సేవ అభిషేకాలు దంపతలచే కుంకుమార్చన, అమ్మవారికి వడి బియ్యం కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ పురపాలక సంఘం ఛైర్మన్ లు శ్రీశైలం, సత్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారిని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా మెమెంటో తో సన్మానం చేశారు. ఈసందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు దాన ధర్మాలు చెయ్యడం పుట్టుక తో నేర్చుకున్నారు అని, ప్రతి సంవత్సరం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం చాలా గోప్ప విషయం అని అన్నారు. జైపాల్ యాదవ్ వెంట గోవర్ధన్, విజయ్ గౌడ్, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ సతీమణి గీతా రెడ్డి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు వారి కుటుంబ సభ్యుల ద్వారా పంపించడం జరిగింది అని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆనంతరం పెద్ద మంగళహారతి భక్తులకు దాతల సహకారంతో అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి, ఉత్సవ కమిటీ సలహాదారు వాస శేఖర్, కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండ్ల రేవంత్, దాచేపల్లి నితిన్, కోశాధికారి లు పోల గిరిబాబు, సంబ తరుణ్ , పెద్ద సంఖ్యలో మహిలలు పాల్గొని అమ్మవారి కి వాడి బియ్యం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు సభ్యులు మహిలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Kalam Power News