కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : వాసవి క్లబ్ ల ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సేవలలో ఆయా క్లబ్ అధ్యక్షుల పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న క్లబ్ అధ్యక్షులు అందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వి 108లో కల్వకుర్తి, రాయచూర్, జడ్చర్ల అధ్యక్షులు అర్హత సాధించారు. ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ, కార్యదర్శి గార్లపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ పూర్వాధ్యక్షుల కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మానంలో కల్వకుర్తి క్లబ్ నుండి జూలూరు రమేష్ బాబు, కల్మచర్ల రమేష్, కల్మచర్ల గోపాల్, కల్వ హరికృష్ణ, గుగ్గిల శంకర్, దాచేపల్లి మనోహర్, చిదిరి శ్రీనివాస్, బాదం రాఘవేందర్ లను ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి మెమొంటోను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అందించిన సేవలకు సత్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.
Admin
Kalam Power News