కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తిలో ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది ఉదయం సుప్రభాతంతో మొదలుకొని అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ మరియు దంపతులచే సామూహిక కుంకుమార్చనలు జరపడం జరిగింది. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి ఎనుముల గీత హాజరయ్యి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అవోపా వారిచే బహుమతులు ఇవ్వడం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాద వితరణ మరియు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందించడం జరిగింది. సాయంత్రం ఎస్ పి ఆర్ జీనియస్ విద్యార్థులచే మహిషాసుర మర్దిని స్తోత్ర పఠనం చేయడం జరిగింది మహిళలచే దాండియా కోలాటంలు మరియు అమ్మవారికి మంత్రపుష్పం ప్రదర్శ పూజలు నిర్వహించడం జరిగింది. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, శివ జగదీశ్వర్ మరియు ఆర్యవైశ్య సంఘం అనుబంధ అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News