కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కల్వకుర్తి, మార్చి 4 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి టెంపుల్ ప్రాంగణంలో హోలీ పండుగను అంగరంగ వైభవంగా, అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆర్యవైశ్య మహాసభతో పాటు వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐక్యతకు ప్రతీకగా ఒకే వేదికపై చేరి రంగులతో పరస్పరం అభినందించుకుంటూ హోలీ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జూలూరి రమేష్ బాబు (ఇంటర్నేషనల్ సర్వీసెస్ సెక్రటరీ) హాజరై కార్యక్రమానికి మరింత శోభాయమానత తీసుకొచ్చారు. ఆయన సమక్షంలో జరిగిన ఈ వేడుక పాల్గొన్నవారికి మరపురాని అనుభూతిగా నిలిచింది. రంగుల హోలీ ఆనందాలు ప్రతి ఇంట సంతోషాలు, శాంతి, ఐశ్వర్యాలు నింపాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
Admin
Kalam Power News