కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు అధ్యక్షతన దసరా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పట్టణ ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు. 2025 -26 నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి, 2026-27 నవరాత్రి ఉత్సవ కమిటీ గా కల్మిచర్ల గోపాల్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలతోపాటు, వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గంధం ప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వాస శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివాలయం శ్రీనివాస్, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కల్వ మనోహర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు బిచాని బాలకృష్ణ తో పాటు ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు
Admin
Kalam Power News