కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా ప్రతినిధి : శనివారం చిట్యాలలోని వ్యవసాయ మార్కెట్ గోదాములలోని కౌంటింగ్ సెంటర్ లో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3వ తేదీన నిర్వహించే కౌంటింగ్ సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హాల్లో లైటింగ్, విద్యుత్తు సరఫరా, సౌండ్ సిస్టం, టేబుల్స్ ఏర్పాటు సరిగా ఉండేలా చూడాలని, కౌంటింగ్ రోజు కు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Admin
Kalam Power News